Member-only story
ఇల్లు అమ్మి పెట్టి చూడు
“నాది బయోటెక్నాలజీ ఫీల్డ్. నేను ఇల్లు అమ్మించే ఏజెంట్ ని కాదు. మీరు ఏదో తప్పు నెంబరుకి ఫోన్ చేశారు.”
“లేదు లేదు. మీ గురించి తెలిసే ఫోన్ చేశాను. కిడంబి రఘునాథ్ గారు చాలా ఏళ్ళ క్రితం మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు అభయ టెక్నాలజిస్ట్ అని పరిచయం చేశారు. నాకు బాగా గుర్తు. నేను ఉన్న పరిస్థితులలో మీ వంటి వారి సహాయం చాలా అవసరం. దయచేసి నేను చెప్పేది వినండి” అని మొదలు పెట్టి ఆయన వివరంగా విషయం చెప్పారు.
ఆయన పేరు ప్రభాకరం. న్యూయార్క్ మహానగరంలోని క్వీన్సులో నివాసం. వయసు అరవై ఏళ్ళు. అమెరికా ప్రెసిడెంట్ జార్జి బుష్ అవకతవక ఆర్థిక రాజకీయ విధానాల వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఫలితంగా ఆయన పనిచేసే కంపెనీ మూసేసారు. పెన్షన్ డబ్బు కూడా సగానికి సగం పడిపోయింది. పిల్లలు ఎదిగినవాళ్ళే. అయితే ఇంటి మురిపెం తీరిపోయింది. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుతో హాయిగా బ్రతకవచ్చన్న ఆలోచనతో ఆయనకున్న పెద్ద ఇల్లు అమ్ముదామని కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా దిగజారడం వల్ల ఇల్లు అమ్మడం చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి రొక్కం పెట్టి కొనే ఇండియన్ మార్కెట్లో ఉన్నాడుట. అతను హెచ్1 వీసా మీద ఉన్న కుర్రాడుట. వాస్తుపై చాలా పట్టింపులు ఉన్నవాడు. అయితే ప్రభాకరంగారి ఇల్లు 20 ఏళ్ళ క్రిందట కొన్న ఇల్లు. ఆ రోజుల్లో అమెరికాలో వాస్తు విషయం ఆలోచించేవారు కాదుట. కానీ ఈ రోజుల్లో ఈ హెచ్1 వాళ్ళల్లో చాలా మంది వాస్తు చూసే కొంటున్నారుట. ఆ రోజుల్లో ఇండియా అమెరికాలా ఉంటే బాగుండునని, అమెరికా ఇండియాలా ఉంటే బాగుండునని అనుకునేవారు. కాని ఇలా వాస్తు వంటివి వస్తాయని ఏనాడూ అనుకోలేదుట. నేను ఏదో ఒకలా ఆ హెచ్1 కుర్రాడిని ఒప్పించి ఈ ఇల్లు అమ్మించి పుణ్యం కట్టుకోవాలిట — ఇదీ ఫోను సారాంశం.
***