Member-only story
చెత్తకు కరువొచ్చింది
మా ఊరు సగటు ఊరు అన్న చిరునామాకు సరిపడే ఊరు. లెక్కపెట్టలేనన్ని అన్యాయాలు ఉన్న ఊరు. బడి దగ్గర నుండి గుడి దాకా, ఆస్పత్రి నుండి స్మశానం దాకా, మిగిలిన చాలా వాటి నుండి చాలా వాటి దాకా ఏదీ మునుపటిలా లేదు. అయితే మరి ఊరు ఎలా ఉంది? ‘లంచం’ అనే ‘ఇంధనం’తో ఆ ఊరి ‘యంత్రం’ నిక్షేపంగా ఉంది. అలాంటి ఊర్లో నిన్న జరిగిన మునిసిపాల్టీ ఎలక్షన్ల ఫలితాలు ఇవాళ ఉదయం తెలిసాయి. అర్థబలం, అంగబలం వ్యర్థం కాలేదు. గెలుపు వాటిదే, ఒక్క కోటీశ్వర్రావు విషయంలో తప్ప రెండు వర్గాల నాయకులు వారివారి వార్డులలో కౌన్సిలర్లుగా నెగ్గారు. ఇక మిగిలింది చైర్మన్ పదవికి పోటీ. ఇరువర్గాల వారు ఎన్ని ఎత్తులు వేసినా, గోడమీద పిల్లి (గోపి)లా ఉన్న కౌన్సిలర్ల వల్ల మెజారిటీ ఎవరిది అన్నది నిశ్చయించుకోలేకపోతున్నారు. ఈ గోపి కౌన్సిలర్ల రేటు గంట గంటకూ పెరిగిపోతోంది. ఇరువర్గాల నాయకులకు ఒకరి మీద ఒకరికి కోపం క్రమంగా తగ్గుతోంది. ఆ కోపం గోపి కౌన్సిలర్ల మీద పెరిగిపోతోంది. సాయంత్రానికి గోపి కౌన్సిలర్ల రేటు చైర్మన్ పదవీ కాలంలో ‘సంపాదన’ కంటే ఎక్కువైపోయింది. ఈ విషయం ఇరు వర్గాల నాయకులని కలవర పెట్టింది. రాత్రి అయింది. ఇద్దరు నాయకులు విడివిడిగా ఒక నిర్ణయానికి వచ్చారు. అర్ధరాత్రి కనకయ్య సారా కొట్టు వెనక గదిలో కలుసుకున్నారు. బావా అంటే బావా అనుకొన్నారు. గోపి కౌన్సిలర్లకు బాగా బుద్ధి చెప్పాలనుకున్నారు.
మర్నాడు కౌన్సిలర్ కోటీశ్వర్రావు పోటీ లేకుండానే చైర్మన్ అయ్యాడు. గోపి కౌన్సిలర్లు రాత్రి తాగిన విదేశీ మందు మత్తులో కన్న కలలన్నీ కరిగిపోయాయి. వాళ్ళు గాలిలో కట్టిన మేడలన్నీ అక్కడికక్కడే కూలిపోయాయి. అమెరికా వెళతాడనుకున్న కొడుకు అడ్డరోడ్డు దగ్గర బస్సు దిగి ఉసూరుమంటూ ఊర్లోకి నడిచి వచ్చినట్లుంది వాళ్ళకి.
***
కోటీశ్వర్రావు తన ఊరి మీద అమితమైన ప్రేమతో, మితమైన మిలట్రీ పెన్షతో ఆ ఊర్లో రెండేళ్ళ క్రితం వచ్చి స్థిరపడ్డాడు…