Member-only story
తైలవర్ణ (వి)చిత్రం
న్యూయార్కునగరం పొలిమేరలో ఉంది మా ఇల్లు. అందువల్ల అర్ధరాత్రి అయినా సరే మా ఆవిడతో పాటు ఒక రెండు మైళ్లు వాకింగ్ కు వెళ్లడానికి వీలవుతుంది. ఆకురాలు కాలం ప్రారంభం కాగానే మారీ మారని ఆకులు వివిధ రంగులు సంతరించుకుంటున్న ఒకానొక రోజు రాత్రి తొమ్మిది గంటలకి భోజనం చేసి వాకింగ్ కి వెళ్లాం. దార్లో ఉన్న ఒక బస్టాప్లో ఒక ఆప్టో అమెరికన్ (వాళ్ళని నల్లవాడు అని అనకూడదని మావాడికి స్కూల్లో నేర్పారు. వాడు మాకు ఇంట్లో నేర్పాడు) భుజానికో సంచి, చేతిలో ఒక చిన్న పెట్టెతో ఒంటరిగా సిటీబస్ కోసం ఎదురు చూస్తున్నాడు. మేం మా వాకింగ్ పూర్తి చేసుకొని వెనక్కి వస్తుంటే మళ్ళీ అక్కడే కనిపించాడు, దూరంనుండే.
“ఆఖరి బస్ మిస్సయ్యాడేమో” అంది కరుణ అని పిలవబడే మా ఆవిడ కె. అరుణ.
“అంటే అతన్ని ఇప్పుడు మనింటికి తీసుకెళ్లి ఈ రాత్రి ఉంచాలనా నీ ఉద్దేశ్యం” అన్నాను, భాషకి అందని భావాల్ని పదాల మధ్య ‘స్మగ్లింగ్’ చేసే మా ఆవిడ తత్వం తెలిసిన నేను.
“వద్దన్నానా?” ఆమె సంక్షిప్త, సాధికార సమాధానం ప్రశ్నగా “ఇప్పటికే ఇల్లు సత్రం చేసానంటున్నావ్…..”
“అన్నా అనకపోయినా అయ్యేది అదేగా” అంది నవ్వుతూ. ఇంతలో బస్ స్టాప్ దగ్గరికి వచ్చాం .
“లాస్ట్ క్లాస్ మిస్సయ్యారా?” అని అడిగాను ఇంగ్లీషులో.
“లాస్ట్ బస్ ఎప్పుడు?” అంటూ వచ్చీరాని ఇంగ్లీషులో ఫ్రెంచియాసతో అడిగాడు.
బహుశా పూర్వం ఫ్రెంచి వాళ్ళు పాలించిన ఏ ఆఫ్రికా దేశస్తుడో అయి ఉంటాడని అనుకొని మనకొచ్చిన ఫ్రెంచి భాష వెలగబెట్టడానికి అవకాశం వచ్చింది కదా అని మనసులో సంతోషించి, ఫ్రెంచిలో సంభాషణ సాగించాం.
బస్ స్టాప్ లో ఉన్న టైంటేబుల్ చూసాను. “లాస్టు బస్ వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం 5.30 నిముషాలకు మొదటి బస్ ఉంది. ఇక్కడ టాక్సీ దొరకాలంటే ఫోను చెయ్యాలి”…