Member-only story
మంబాస — Mombasa (Telugu)
“మంబాస”
“మీరు ఏ పట్టణం నుండి వచ్చారు?” అన్న నా ప్రశ్నకు ఒక స్నేహితుడు చెప్పిన సమాధానమది.
ఆ పేరు వినగానే ఒక్కసారిగా నా ఒళ్ళు గగుర్పొడిచింది. నా శరీరంలో ఉన్న ముప్ఫై లక్షల కోట్ల కణాలు కేరింతలు కొట్టిన అనుభూతి కలిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకూ కూడా, ఎప్పుడు ఆ పేరు విన్నా నాలో అదే సంతోషం, అదే పులకింత.
ముంబాస, ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశపు తూర్పుతీరాన ఉన్న పట్టణం. నేనెప్పుడూ అడుగుపెట్టని ఆ నగరంతో నాకేమిటి పులకింత ఈ పులకింత ? మంబాస అన్న మూడక్షరాల పేరు వినగానే నాలోని ప్రతీ జీవకణం ఎందుకు పులకించిపోతోంది? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. అలా మరికొంతకాలం గడిచింది. న్యూయార్క్ నగరంలోని ఉద్యోగం జీవితపు ఒత్తిళ్ళతోను, భారతదేశం నుండి నా భార్య రావడంతో మొదలైన సాంసారిక బాధ్యతలతోను నా మంబాస అన్వేషణ వెనుకబడిపోయింది.
**
నేను భారతదేశంలో డిగ్రీ పూర్తిచేసి, మాస్టర్స్ చేయడానికి అమెరికా వచ్చాను. పిహెచ్.డి కూడా పూర్తిచేసి ఉద్యోగంలో చేరాను. నా చదువు, ఉద్యోగం అన్నీ న్యూయార్క్ నగరంలోనే. భారత దేశంలో ఆత్మీయమైన కుటుంబ వాతావరణంలో పెరిగిన నేను, మానవ సంబంధాలకు పెద్దగా విలువ ఇవ్వని ఇక్కడవారి మధ్య ఇమడడానికి చాలాకాలమే పట్టింది. పోనీ అమెరికా జాతీయులు అలా ఉన్నారంటే అనుకోవచ్చు, కానీ మనదేశం నుండి వచ్చి స్థిరపడిన వారు కూడా మానవసంబంధాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. అప్పుడే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నాకు కాబోయే భార్య కచ్చితంగా అచ్చమైన తెలుగింటమ్మాయి అయ్యుండాలి…