Member-only story
మధుర వోణి
“మనుమరాలికి కానుక ఇవ్వాలని ఎవరికి ఉండదు? ఉంటుంది. అందరికీ ఉంటుంది. నాకూ ఉంది. పుట్టబోయే ఆ పిల్లకి ఇచ్చే కానుక గురించి, పెట్టే పేరు గురించి వాళ్ళ తల్లితండ్రుల నుంచి చుట్టాలు, బంధువులు, ఆత్మీయులు, గాఢ మిత్రుల వరకూ అందరికీ ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. నాకు మాత్రం ఇచ్చే కానుక గురించే ఆలోచన. మా అమ్మమ్మ 1900 సంవత్సరంలో పుట్టింది. నా మనుమరాలు 2020లో పుడుతుంది. నా మానవ సంబంధాల కాల విస్తీర్ణం ఇప్పటికి 120 సంవత్సరాలు. అమెరికాలో నేడు పుట్టే ఆడపిల్లలు 100 ఏళ్ళు బ్రతుకుతారని శాస్త్రజ్ఞుల అంచనా. పుట్టబోయే నా మనుమరాలు 100 ఏళ్ళు బ్రతుకుతుంది. ఆమె ఆలోచనలలో మా జ్ఞాపకాలు అన్నాళ్ళు బ్రతికి ఉంటాయి. ఈమె పుట్టుకతో నా మానవ సంబంధ కాల విస్తీర్ణం మరో వందేళ్ళు పెరుగుతుంది. నాలోని ఒక అంశని తరవాతి తరాలకి అందిస్తుంది. అందుచేత ఇచ్చే కానుక అంత ముఖ్యమైనది కావాలనిపించింది. మా అమ్మమ్మ నన్ను ఎంత ముద్దు చేసేదో అంత ముద్దు చెయ్యాలి. అంతకన్నా ఎక్కువే ముద్దుచెయ్యాలి.
అహంకారం కొద్దీ అలా అంటాం కానీ ప్రేమించడం, ముద్దు చెయ్యడం లాంటివి వాటికవే సంపూర్ణాలు. అవి మనసుని ఆశ్రయించి ఉంటాయి. భౌతికమైన వాటికే చిన్న, పెద్ద, తక్కువ, ఎక్కువ కానీ, అభౌతికమైన వాటికి అవి వర్తించవు. కానీ అభౌతికమైన వాటిని అందిచేవి భౌతికమైనవే. వాటినే కానుకలు అంటాం. మానసిక పరిపక్వం వచ్చేదాకా మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధాలలో ఈ కానుకల పాత్ర ఉంటుంది. పొత్తిళ్ళలో పాపాయి దగ్గర నుండి పెద్దెన అమ్మాయి దాకా దానికి కావలసిన ముచ్చట నిచ్చే ఒక కానుక ఇవ్వాలి.
అమ్మమ్మని గుర్తుకు తెచ్చే తమ్మెట్లు, మంగళసూత్రాలు, పంచలోహపాత్ర, పూజసామగ్రి, వెండి గ్లాసులాంటి ఎన్నో వస్తువులు గుర్తుకు తెచ్చుకున్నాను…