Member-only story
వీడియో గేమ్స్ వండర్ కిడ్స్
‘వరల్డ్ వీడియో గేమ్స్ వండర్ కిడ్స్’ పోటీలో మొదటి స్థానాల్ని గెలుచుకొన్న పిల్లల ఫోటోలు, వివరాలు న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక మొదటి పేజీలో ముచ్చటగా ముద్రించారు. అమెరికాలో లాస్ ఏంజల్సులో 2010లో జరగబోయే 10వ వరల్డ్ సైబర్ గేమ్స్ పోటీలకు వీరందరికి ఆహ్వానం వచ్చిందట. న్యూయార్క్ లో ఉన్న కొలంబియా యూనివర్సిటీ వారు వీడియో గేముల ఆధారంగా ఏర్పాటు చేసిన ‘రహ..రా అల్జీబ్రా’ అన్న లెక్కల పోటీలలో అతిధులుగా పాల్గొనడానికి ఈ పిల్లలను న్యూయార్క్ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఆహ్వానించారు. ఎక్కడో స్పోర్ట్స్ పేజీలో ఒక మూల కాకుండా మొదటి పేజీలో ప్రముఖంగా ఈ వార్త రాయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అందుకే ఈ వార్త ప్రపంచం నలుమూలలకు అతి తొందరగా చేరడంతో అందరూ శ్రద్ధగా చదివారు. టీవీలలో చూసారు. గత పదేళ్ళుగా ఈ పోటీలు జరుగుతున్నా, ఇప్పుడే ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం వీడియో గేములు కాదు, ఆ వీడియో గేములు గెలుచుకున్న పిల్లలు. సాధారణంగా కొరియన్ పిల్లలు, అమెరికన్ పిల్లలు, సంపన్న దేశాల పిల్లలు గెలుస్తారు. కాని ఈమారు గెలిచిన వారందరూ భారతీయులే. అందరూ ఐదో తరగతిలోపు పిల్లలే. నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా శ్రీ రత్నం చిట్టూరి, శ్రీ మురళి గవిని చేసిన కృషి వల్ల అమెరికాలో స్కిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో తరుచూ మొదటి పది స్థానాలలో ఎక్కువ మంది భారతీయులే ఉండడం సహజం. కాని ఈ పిల్లలు అమెరికాలోని భారతీయుల పిల్లలు కారు. వీరు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో దోమలపల్లి అన్న ఒక చిన్న పల్లెటూరికి చెందిన పిల్లలు. దోమలపల్లిలో ఉన్నవారంతా దారిద్ర్య రేఖకి దిగువ ఉన్నవారే. కంప్యూటర్లు లేని వారు వీడియో గేములు కొని ఆడుకునే తాహతు లేనివారు. పైగా అంతా పదేళ్ళ లోపువారే. ఈ పిల్లలు కొరియా, అమెరికా వంటి సంపన్న దేశాల పిల్లల్ని ఎలా ఓడించారు? నెల రోజుల క్రిందట ఢిల్లీలో మొదటిసారి వీడియో గేముల పోటీని చూశారుట. ఆడారుట. అప్పుడే పిసి గేములు, ఎక్స్ బాక్సు గేములు, మొబైల్ గేములు ఎలా ఆడాలో…