Member-only story
ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే ఊరు
“మా ఊరులో అర్థరాత్రి ఆడపిల్లలు నిర్భయంగా తిరగగలరు” అన్నాడు మాపక్కనే కూర్చున్న వ్యక్తి ఎదురుగా ఉన్న ఆవిడతో.
ఆవిడ తన కూతురు ఒక్కర్తె హైదరాబాద్ వెళ్తుంటే ఆమెను సాగనంపుదామని వచ్చి రైలు ఎక్కింది. ఆ అమ్మాయిని పక్కనే ఉన్న తోటి ప్రయాణికులందరికి పరిచయం చేసి, ఆ అమ్మాయిని క్షేమంగా చేరేలా చూడమని అడుగుతోంది.
“నిజమా” అందరం ఆశ్చర్యపోయాం .
“ఇలా చెబితే నమ్మలేరుకాని జరిగింది చెబితే నమ్మకుండా ఉండలేరు.” అని ఆగాడు.
మేము అంతా జరిగిందో ఏమిటో చెప్పమని అడుగుతాం అన్న ధీమాతో రెండు కాళ్లు ఎత్తి మఠం వేసుకుని బెర్త్ మీద వెనక్కి జారబడి నేను సిద్ధం అన్నట్లు అందరివైపూ చూశాడు ఆ వ్యక్తి.
రైలు కదలబోయింది. సాగనంపడానికి వచ్చిన తల్లి ఆదరాబాదరగా రైలు దిగింది. రైలు కదిలింది. మాలో కుతూహలం, నాటిన విత్తనంలో మొలక మొలిచినట్లు బైటికి వచ్చింది. మాలో అందరికంటే వయసులో చిన్నవాడు,
“మీ ఊరిలో ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్ ” అన్నాడు.
అందరం అతనివైపే చూస్తున్నాం.
సుమారు 30ఏళ్ళ వయసు, విదేశీయుడా అనిపించేంతటి తెల్లని రంగు. కొద్దిగా మాసిన బట్టలు. తైల సంస్కారం లేని తల. మెరిసే కళ్ళు. తీక్షణమైన చూపు. సాధారణ ప్రయాణీకుడిలానే ఉన్నాడు. కాని ఏదో ప్రత్యేకత కలిగినవాడనిపిస్తాడు. మొదటి చూపులోనే
“మా ఊరి ఎమ్.ఎల్.ఏ. కొడుకు ఒక బ్రాహ్మణ అమ్మాయిని వాళ్ల ఇంటికే వెళ్లి రేప్ చేశాడు.
నిశ్శబ్దం.
“ఇప్పుడు మీరు ఎలాగా ఉన్నారో అలాగే బలహీనవర్గమైన బ్రాహ్మలు నిశ్శబ్దంగానే ఉన్నారు. రెడ్లు, కమ్మలు, రకరకాల బిసిలు, కాపులు, అందరూ మనకెందుకు అని, కొంతమంది బాపన్లకు కావాల్సిందే అని ఊర్కొన్నారు. ఎమ్.ఎల్.ఏ…