Member-only story
ఒక శీత కథ
“అవునే అమ్మమ్మా, నాకు శీతగా ఉందే’ అప్పారావు ఫోనులో అంటున్న మాటలు విన్న సరిత ఆశ్చర్యపోయింది.
తరవాత భర్త మాటలేవీ వినిపించలేదామెకు. బెడ్ రూమ్ లో కూర్చున్నది ఉన్నట్టుండి లేచి లివింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆలోచిస్తున్న కొద్దీ బాధ కలిగింది. బాధ కొద్దిసేపటికి దు:ఖంగా మారింది. దు:ఖం మరికొంత సేపటికి సన్నని ఏడుపుగా మారింది. సన్నని ఏడుపు, బయట పెట్టలేని బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకోగా బావురుమంది. అది అప్పారావుకి వినిపించింది.
“సరితా!” అంటూ పరుగులాంటి నడకతో సరిత దగ్గరికి వచ్చాడు. ప్రక్కనే ఆగి చేతుల్లో మొహం పెట్టుకుని ఏడుస్తున్న సరిత తలమీద చెయ్యి వేసాడు.
“ఏమయ్యింది సరితా?” అంటూ గాభరాగా అడిగాడు. సరిత ఏడుపు ఆపలేదు, తగ్గించలేదు, కనీసం అప్పారావు వచ్చాడన్న విషయాన్ని గుర్తించలేదు. సరితకి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోగలనని, అసలు ఎలాంటి కష్టాలు రానివ్వనని, జీవితమంతా సరితని సుఖ పెట్టేస్తానన్న అతి గాఢ నమ్మకంతో నెల రోజుల క్రిందట న్యూయార్క్ మహానగరంలో కొత్త కాపురం మొదలుపెట్టాడు అప్పారావు. క్షణం ఖాళీ దొరికితే చాలు… పెళ్ళిచూపులు, వెంటనే సరితతో పెళ్ళి, హనీమూన్, పదహారు రోజుల పండగ, ఒక జీవితానికి మించి చేసుకున్న బాసలు గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఇంకా ఇంకా క్షణం ఖాళీ లేకుండా గడిపిన మూడు వారాల ఇండియా ప్రయాణం, గాలిలో నిజంగానే తేలిపోతూ, వెళ్ళినప్పటి కంటే అతి తేలికగా కొత్త పెళ్ళికూతురితో న్యూయాలో దిగడం… లాంటివి కమ్ముకొచ్చే శ్రావణ మేఘాల్లా అప్పారావుని ఉబ్బితబ్బిబ్బు చేస్తున్నాయి.
సరిత ఏడవడం, ఏడుస్తున్నప్పుడు తను దగ్గరకు వస్తే సినిమాల్లో మాదిరి కాకపోయినా కనీసం తనకి తోచిన విధంగా ‘అప్పారావూ అనో, మరో ముద్దు పేరుతోనో, లేకపోతే ‘నాకో కష్టం వచ్చిందిరా!’ అని అల్ట్రామోడ్రన్ గానైనా అని ఉంటే అప్పారావుకి అసలేమీ కష్టం అనిపించకపోయి ఉండేది. అలాంటిదేమీ కాక, అసలే విషయం తెలియక…