కినోవా, వరి, గోధుమ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం!
కోట్ల మంది ప్రజలకు అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన ఆహారం కోసం, వారిలో పోషకాహార లోపం తగ్గించడం కోసం డయాబెటిస్ వంటి అనారోగ్యం తగ్గించడం కోసం నా ఆలోచనలు 40 ఏళ్ల కిందటే మొదలయ్యాయి. 1982 లో ‘ది హిందూ’ న్యూస్ పేపర్లో ప్రచురించబడ్డ ‘రిచ్ ఫుడ్ ఫ్రం ది సి’ వ్యాసం దీనికి ఉదాహరణ. అప్పుడు నేను సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ లో విద్యార్థి పరిశోధకుడిగా ఉండేవాణ్ణి.
పోషకాహార లోపం నివారించడం ఒక పరిశోధన విషయంగా 1980 నుండే నా ఆలోచనలలో ఉండేవి. నేను వ్యాక్సిన్ సంబంధించిన సమావేశాలకి విదేశాలకు లేదా ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు వెళ్ళినప్పుడు ఆ ఆలోచన పెరుగుతూ వచ్చాయి. ప్రాథమిక విద్య కోసం పనిచేసే ప్రథం సంస్థ కోసం భారతదేశం గ్రామాల్లో తిరి గినప్పుడు కానీ, శాంతా బయోటెక్ పని కోసం భారతదేశం పలుమార్లు వచ్చినప్పుడు కానీ ఈ ఆలోచన నాలో స్థిరపడ్డాయి.
ఆరోగ్యం కోసం వైద్య వృత్తిలో ఉన్న నా భార్య కూతురు సలహాపై కినోవా తినడం మొదలు పెట్టినప్పుడు ఈ ఆలోచనలు కార్యరూపం దాల్చాయి.
కినోవా హెల్త్ అండ్ న్యూట్రిషన్ బెనిఫిట్స్ ( కినోవా పోషకాల వల్ల కలిగే ఆరోగ్య ఉపయోగా లు) పుస్తకాన్ని ప్రపంచంలో వివిధ శాస్త్రవేత్తలు నాతో పని చేసే విద్యార్థులు తో కలిసి 2015 లో ప్రచురించాను.
అప్పుడు, (2015) ఒక కిలో కినోవా 1,600 రూపాయలు ఉండేది. అది అందరికీ అందుబాటులో లేని ధర. అందువలన మేము అరకు లోయ లో కినోవా పండించడం మొదలు పెట్టాం. ఆ పంటని కిలో 600 రూపాయలు కి డాక్టర్ కినోవా పేరుతో అమ్మడం మొదలు పెట్టాం. ఇప్పుడు (2022) కిలో కినోవా 199 రూపాయలకే అమ్ముతున్నాం!
ఇది నేను, నాతో పని చేసేవారు ఇప్పటిదాకా మంచి పోషకాహారం అందించడానికి చేసిన కృషి.
ఇప్పుడు బియ్యంలో అధిక ప్రోటీన్లు , ఐరన్, జింక్, మరియు గోధుమలో అధిక పీచు పదార్థం వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అందించడానికి సిద్ధమవుతున్నాం.