కొవిడ్ 19 — మొదటి పాఠం –ఆహారం!
కోవిడ్-19మేలుకొలుపుతో ప్రపంచం పోషణపై దృష్టి పెడుతుంది అని ఆశిస్తున్నాను!
కంటికి కనబడని కరోనా వైరస్ భూమిపై మానవ జీవితంలోని ప్రతి రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. మన తరంలో ఇంత విస్తృతంగా ప్రజలను మరేది ఇన్ని రకాల నష్టాలకు గురి చేయలేదు. వైరస్ బారిన పడతామనే భయంతో వందల కోట్ల మంది ఇంట్లోనే ఉన్నారు. ఈ వైరస్ ఎందుకు అంత శక్తివంతమైనది? ఈ శక్తికి కారణం ఏమిటి? చావు! 23 మే 2020 నాటికి, కరోనావైరస్ కారణంగా 338,183 మంది మరణించారు. ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది మరియు ప్రాణాలను రక్షించడంలో పాల్గొన్న నిపుణులందరూ మరణాన్ని తగ్గించడానికి లేదా నివారించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
మరణాలను నివారించడమే మన లక్ష్యం అయితే, మనం తప్పించగల ప్రధాన మరణాలపై దృష్టి పెడదాం.
పోషక విలువలు లేని ఆహారం -మరణానికి ప్రధాన ప్రమాద కారణం.
130మంది శాస్త్రవేత్తలు మరియు వైద్యుల బృందం, 1990–2017కాలంలో జరిగిన మరణాలకి ప్రమాద కారణాలను అధ్యయనం చేశారు. వారి ఫలితాలలో అనారోగ్యకరమైన ఆహారం వలన 20% మరణిస్తున్నారు అని తెలిసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రమాద కారణాల కంటే ఎక్కువ మరణాలకు కారణమని తేలింది. దీని వలన ప్రతి సంవత్సరం కోటి పైనే మంది మరణిస్తున్నారు.కాబట్టి ఆహారం ప్రాధమిక ప్రమాద కారకం లేదా మరణానికి కారణం అయినప్పుడు, మనం దానిపై దృష్టి పెట్టాలి, నివారించదగిన మరణాలను తగ్గించాలి.
మానవ శరీరం — అసాధారణ అణు కర్మాగారం
మానవ శరీరం అసాధారణమైన అణు కర్మాగారం. దీని ప్రాధమిక పని శక్తిని ఉత్పత్తి చేయడం. ఇది ఆహారాన్ని ముడి పదార్థంగా తీసుకొని అణువులుగా జీర్ణం చేసి, శక్తిని ఉత్పత్తి చేస్తుంది. “హ్యూమన్ మెటబోలోమిక్స్ డేటాబేస్” ప్రకారం, మానవ శరీరంలో 1,000,000 అణువులు పనిచేస్తున్నాయని అంచనా. ఈ అణువులు పనిచేసే క్రమంలో ఏదైనా అసమతుల్యతఉంటే,అది వ్యాధికి దారితీస్తుంది. అందువలన శరీరాన్ని ప్రధానంగా ఆహారంతో ఆరోగ్యస్థితిలో ఉంచవచ్చు. మరణాలను తగ్గించదానికి పొషకాలు ఎక్కువ ఉన్న ఆహారం ముఖ్యం.
మానవ శరీరానికి ఆహారం నుండి 150 పోషకాలు అవసరం. స్థూల పోషకాలు,కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులు ఎక్కువ మరియు సూక్ష్మపోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలను తక్కువ పరిమాణంలో అవసరం. మానవ శరీరానికి అవసరమైన 13 ముఖ్యమైన విటమిన్లు విటమిన్లు ఎ, సి, డి, ఇ, కె, మరియు బి విటమిన్లు: థియామిన్ (బి 1), రిబోఫ్లేవిన్ (బి 2), నియాసిన్ (బి 3), పాంతోతేనిక్ ఆమ్లం (బి 5), పైరాక్సిడైన్ (బి 6) , బయోటిన్ (బి 7), ఫోలేట్ (బి 9) మరియు కోబాలమిన్ (బి 12). శరీరానికి అవసరమైన 16 ముఖ్యమైన ఖనిజాలు కాల్షియం, భాస్వరం, పొటాషియం, సల్ఫర్, సోడియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, అయోడిన్ మరియు సెలీనియం, మాలిబ్డినం, క్రోమియం మరియు ఫ్లోరైడ్.
జీవక్రియలు ఒకటి కంటే ఎక్కువ కారకాలచే ప్రభావితమైనప్పుడు, ఈ కారకాలలోతక్కువగా ఉన్న కారకం జీవక్రియలను నిర్ధేశిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం ఇతర పోషకాలను ఎంత ఎక్కువ ఇచ్చినా, తక్కువగా ఉన్న పోషకాల ద్వారా నిర్ణయించబడుతుంది, అందువల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని పోషకాలు స్థూల మరియు సూక్ష్మపోషకాలు శరీరానికి సమతుల్య / సరైన స్థాయిలో అందుబాటులో ఇవ్వాలి.
ప్రపంచ వ్యాప్త పోషకాహారలోపం
ప్రపంచంలో 2౦౦ వందల కొట్ల ప్రజలు ఆరోగ్యానికి కావలసిన ఆహారం పూర్తిగా తీసుకోవడం లేదు. పోషకాలు తక్కువున్నా ఆహారపు అలవాట్లు దీర్ఘకాలిక వ్యాధులకు తోడ్పతాయి. మానవ ఆరోగ్యం మరియు పోషణ రంగంలో శాస్త్రీయ పరిశోధనలు మానవ ఆహారం యొక్క నాణ్యతను మెరుగుపరచడం అత్యవసరం అనినిరూపిస్తున్నాయి.
తగినంత స్థూల మరియు సూక్ష్మపోషకాలు లేకపోవడం పోషకాహార లోపానికి కారణమవుతుంది. స్థూలపోషకాలుఅధికంగా మరియుసూక్ష్మపోషకాలుతక్కువ ఉండటంఉబకాయానికి కారణమవుతుంది. స్థూల మరియు సూక్ష్మపోషకాలలో అసమతుల్యత మధుమేహం మరియు శరీరంలోని ఇతర అనారోగ్యాలకు కూడా కారణమవుతుంది.
ఆహార వైవిధ్యం
ఎక్కువ రకాల ఆహారాలు ఆరోగ్యకరమైన మానవ శరీరానికి ఈ పోషకాలను ఇవ్వగలవు. ప్రకృతిలో సుమారు6,000 మొక్కలు ఆహారంగా ఉపయోగపడతాయి.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 కంటే తక్కువ మొక్కలు వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్నాయి, అందులోనూ5 మాత్రమే — బియ్యం, గోధుమ, మొక్కజొన్న, చిరు ధాన్యాలు మరియు జొన్న — మానవ శక్తి సరఫరాలో 60శాతం వాటా అందిస్తున్నాయి. తరం తరువాత తరం, మనం తక్కువ రకాలఆహారంతింటున్నాం. అందువలన అవసరమైన పోషకాలు మానవ ఆహారంలో అందడం లేదు. ఆహార వైవిధ్యం లేకపోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లెదు.పొషకాల లొపంవలన దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఆహారం సాంస్కృతిక, వ్యక్తిగత మరియు ప్రజల ఆర్థిక స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఆహారంలో పెద్ద మార్పు సాధించడం అంత సులువైన పని కాదు. కానీ అది ప్రస్తుతం చాలా అవసరం. ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని ఆహార పదార్ధాలను తీసుకోవడం ముఖ్యం.
FooDB
FooDB అనేది ఆహారంలోని, పోషకాలకు ప్రపంచంలోనే అతిపెద్ద మరియు సమగ్ర వనరు. ఇది స్థూల మరియు సూక్ష్మపోషకాలు రెండింటిపై సమాచారాన్ని అందిస్తుంది, ఆహారాలకు రుచి, రంగు, రుచి, ఆకృతి మరియు సుగంధాలను ఇచ్చే అనేక భాగాలు ఉన్నాయి. FOODB డేటాబేస్ లో 797 ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ వనరుడేటాబేస్ ఉపయోగించి, మంచి ఆరోగ్యం కోసం మీరు మీ ఆహారంలో వైవిధ్యాన్ని పెంచడానికి ప్రయత్నించవచ్చు.భారతీయ ఆహారపు వివరాలకు NIN హైదరాబాద్ వెబ్ సైట్ చూడండి — https://www.nin.res.in/
మీ జన్యువులతో పాటు మంచి పోషకాహారం ఆరోగ్యానికి పునాది. వ్యాయామం మరియు ఆరోగ్యం రంగాలలో సమాచార, అందుబాటులో ఉన్న విజ్ఞానం మరియు సలహాలతో మీ ఆరోగ్యాన్ని పెంచుకొండి.
కోవిడ్-19మేలుకొలుపుతో ప్రపంచం పోషణపై దృష్టి పెడుతుంది అని ఆశిస్తున్నాను!