Member-only story
తలుపుల రసీదు
బొబ్బిలిలో యూనివర్సిటీ పెట్టే విషయంలో పెద్ద గొడవ జరిగింది. గొడవ బొబ్బిలి వాళ్ళకి, విజయనగరం వాళ్ళకి కాదు. బొబ్బిల్లో ఉన్న బొబ్బిలి వాళ్ళ మధ్యే. యూనివర్సిటీ పేరు పెట్టడంలో పేచీ వచ్చింది. కొందరు వీరబొబ్బిలి యూనివర్సిటీ అనాలని, “కాదహే… రెండొందల ఏభైమంది ఇక్కడ మిగలకుండా చచ్చిపోతే ఈరత్వం ఏడుంటుంది?” అని ప్రశ్నించి “ఉప్పుడు మనం అంతా కేవీస్ కాబట్టి, విబిఎల్ కాదు కెవిబిల్ ఊనివర్సిటీ అని పేరు పెట్టాలి”. ఇదీ గొడవ. కేవి అని పెడితే కులం తీసుకొచ్చినట్లవుతుందని కొందరు వాదించారు. యూనివర్సిటీ అత్యున్నత అధికారులను కులపతి, ఉపకులపతి అని అంటారు కదా అని వెంటనే మరొకరన్నారు. కులపతి అంటే ఛాన్సలర్, ఉపకులపతి అంటే వైస్ ఛాన్సలర్ అని బోధపరచి ఎలాగో ఒకలాగా అందరినీ ఒక కొలిక్కి తీసుకొచ్చాను.
బోస్టన్ యూనివర్సిటీని బియు అంటారు. బ్రౌన్ యూనివర్సిటి ఉంది. బర్మింగ్ హామ్ యూనివర్సిటీ ఉంది. ఇలా ‘బి’తో మొదలయ్యే యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. మనం కూడా బొబ్బిలి యూనివర్సిటి అని పేరు పెడితే బియు ఆఫ్ ఇండియా అంటారు. వాళ్ళంతా మనతో కలిసి బొబ్బిలి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తారు అని రాత్రి పగలు కష్టపడి అందరిని ‘బొబ్బిలి యూనివర్సిటీ’ పేరుకు ఒప్పించాను.
అందరినీ ఒప్పించాను కాబట్టి, వాళ్ళతో కలిసి పనిచేసి బొబ్బిలి యూనివర్సిటీని నాలుగు డిగ్రీలు ఇచ్చి పదిమందికీ పనికి వచ్చేలా రూపకల్పన చెయ్యమన్నారు.
దేశంలో ఇప్పటికి ఉన్నవాటికంటే ఐదురెట్ల సంఖ్యలో యూనివర్సిటీలు కావాలని అందరూ అంటున్నారు. కాని వాటిని నడపడానికి, పాఠాలు చెప్పడానికి, మంచి రిసెర్చి చెయ్యడానికి కావల్సినంత మంది లేరు. ఇంజినీరింగ్ కాలేజీలకే దిక్కు లేకపోతోంది. మరి యూనివర్సిటీ అంటే మాటలా.
మీరు ఇక్కడ ఉండి ముఖ్యమైన వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోండి, అప్పుడు కానీ మీరు వెళ్ళకండి అన్నారు.