Member-only story
తీరం చెమ్మగిల్లింది
న్యూయార్క్ :
“సూర్యంగారూ, మన కుమార్ గారి విషయం మీకు తెలుసు కదా?”
“తెలుసండి. నేను వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించాను. ఇంత అకస్మాత్తుగా ఆయన పోతారనుకోలేదు”
“మీకు ఆయనతో ఎంత పరిచయమో నాకు తెలీదుకాని, ఆయిన చాలా మంచివారండి. అందరినీ కూడగట్టి మన తెలుగు వాళ్ళకి ఏడాది పొడవునా డిన్నర్లు ఇస్తూండేవారు”
“తెలుసండి రామయ్యగారు, నేను కూడా కొన్నిసార్లు వాళ్ళింట విందు భోజనం చేసినవాడినే”
“మీరూ చాలా ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు కదా అని ఫోను చేసాను”
“ఏమిటో చెప్పండి?”
“ఆయన చితాభస్మం ఇండియా పంపించాలండి. ఎలా పంపాలో మీకు ఏమైనా తెలుసా? పోస్టులోనా, కొరియర్ లోనా…”
“చితాభస్మం…. అవును. ఫ్యూనరల్ హెమ్ వాళ్ళు సీల్ చేసి ఇస్తారు. పోస్టాఫీసులో డెత్ సర్టిఫికెట్ చూపించి రిజిస్టర్డ్ పోస్టులో పంపవచ్చు. ఏ పోస్టాఫీసులోనైనా వివరాలు ఇస్తారు. చాలా ఏళ్ల క్రిందట నేనొకసారి పంపాను. సవ్యంగానే అందింది”
‘’కుమార్ గారి బంధువులు హైదరాబాదులో ఉన్నారు. వాళ్ళకి పంపితే చాలుట. ఎన్ని రోజులు పడుతుందో చేరడానికి?”
“నేను విశాఖపట్నం పంపినప్పుడు ఇరవై రోజులు పట్టింది. మరి ఇప్పుడు ఇంకా తక్కువ సమయం పట్టవచ్చు. హైదరాబాద్ అయితే వారం లేదా పది రోజులు పట్టవచ్చు. ఇంకా వేగంగా చేరాలంటే ఫెడెక్స్ లేదా యుపిఎస్ వాళ్ళని అడగమనండి.”
“అవును, అలాగే చెబుతాను.”
“మంచిదండీ.”
మరో అరగంటలో…
“సూర్యంగారూ! వాళ్ళకి అంత తొందరేమీ లేదుటండి. అది సరేకానీ, మీరేమైనా ఇండియా వెళుతున్నారా వచ్చే రెండు మూడు వారాల్లో?”