Member-only story
ప్రేమకి పెద్దబాల శిక్ష !
“ప్రేమ అన్న మాటవిన్నప్పుడల్లా సత్తెప్ప గుర్తుకొస్తాడు. సత్తెప్ప గుర్తొచ్చినప్పుడల్లా నాకళ్ళు చెమ్మగిల్లుతాయి. హృదయం ద్రవిస్తుంది. మనసు ఆర్ధతతో తన్ను తాను మరచిపోతుంది. ఎన్నేళ్ళైనా సరే సత్తెప్పని మొదటిసారి కలిసిన క్షణాలు కళ్ళముందు కదులుతాయి.” అన్నారు. కళ్లజోడు తీసి చెమ్మగిల్లి కళ్లు ఒత్తుకుని మా మాష్టారు.
నేను ప్రేమిస్తున్న రమణిని తీసుకువెళ్ళి మాష్టారుకి పరిచయం చేసి పెళ్లి చేసుకొంటాం అని చెప్పాను. దానికి సమాధానంగా మాష్టారు అన్నది నాకూ రమణికి అర్ధం కాలేదు.
“చాలా సంతోషం మీరిద్దరూ ప్రేమించుకొంటున్నాం అని చెప్పినందుకు. అమ్మాయి ఏమి చదువుకుంది? ఏఊరు?” అని అడిగారు.
“నాతోనే బీ.టెక్ చేసింది. వీళ్ళది హైదరాబాదు” అని చెప్పాను.
మాష్టారు రమణితో నా చిన్నప్పటి విశేషాలు. నా గురించి ఆయనకున్న అభిప్రాయాలు చెప్పారు. రమణి కూడా మాష్టారుతో చక్కగా మాట్లాడింది. మాష్టారితో పాటు టిఫిన్, కాఫీ పూర్తిచేసి
“ఇక వెళ్లోస్తాం” అన్నాను
“మంచిది” అని మాష్టారు మాతోపాటు గుమ్మందాకా వచ్చారు. “మాష్టారూ… మీరు సత్తెప్ప గురించి పూర్తిగా చెప్పకుండానే….” అంది రమణి కుతుహలంతో….
“సత్తెప్ప ఒక స్నేహితుడు. విశిష్టమైన వ్యక్తిత్వం గల స్నేహితుడు” అన్నారు. జవాబుగా.
“మీరు ప్రేమ గురించి ఏదో చెప్పాలని మొదలుపెట్టి ఆపేసినట్లనిపించింది. అందుకని అడిగాను” అంది రమణి.
“నిజమే ప్రేమించుకొంటున్నాం అనుకున్నవాళ్ళంతా సత్తెప్ప జీవితం నుండి తెలుసుకోవలసినది చాలా ఉందేమో అనిపిస్తుంటుంది”
“ఏ విషయంలో” అంది రమణి
“ప్రేమ తత్వంతో జీవించిన అనుభవం” అన్నారు మాష్టారు చిరునవ్వుతో