Member-only story
బొబ్బిలి 1876
శుక్రవారం 22వ తారీఖు, డిసెంబరు 1876. నెలగంటు పెట్టి కొద్ది రోజులు అయింది. వేణుగోపాలాచార్యులు బొబ్బిలి పురవీధులలో గుర్రపు బండిలో ప్రయాణిస్తున్నారు. నులివెచ్చని సూర్యకిరణాలు చెంపలను తాకుతుండగా, పిల్లతెమ్మెరలు తాము తీసుకువచ్చిన పూల పరిమళాలను నాసికాపుటాలకి అందించి పోతున్నాయి.
వేణుగోపాలాచార్యులు ఇరవై ఐదేళ్ళ యువకుడు. మిస మిసలాడుతున్న వయసు. కొలనుపై పడ్డ ఉదయభానుడి కిరణాలు మెరిసి విరజిమ్మే కాంతిలో స్నానించాడా అన్నట్లనిపించే మేని ఛాయ. తగిన వ్యాయామం వల్ల రాణింపు పొందిన శరీరం, మెరుపుల కాంతిలో ముంచి తియ్యబడ్డాయా అన్నటువంటి కళ్ళు, విశాలమైన ఫాలభాగం, పాశ్చాత్య పద్ధతిలో దువ్వబడ్డ జుత్తు ‘ఉన్నతాధికారి సుమా!’ అనిపించే వేషధారణ.
***
పాలకొండలో పుట్టారు వేణుగోపాలాచార్యులు. చెన్నపురి వెళ్ళి అక్కడ పట్టభద్రుడై, లండన్లో బారెట్లా పూర్తి చేసారు. లండన్ ప్రముఖ న్యాయవాది సర్ కేస్ వెంట అమెరికా, యూరోప్ లోని వివిధ దేశాలు వ్యాజములపై తిరిగి అతి చిన్న వయసులోనే విశేషమైన అనుభవాలను, పరిజ్ఞానాన్ని సంపాదించారు. వారు ప్రస్తుతం నిజాంవారి వ్యాజ్య వ్యవహారంపై స్వదేశానికి వచ్చారు. హైదరాబాద్ లో ఆ పని పూర్తి చేసుకుని, తిరిగి లండన్ వెళ్ళే ముందు బంధువులను చూడాలనిపించి రెండు రోజుల క్రితం బొబ్బిలి వచ్చారు.
“మీ అమ్మ పెళ్ళిలో జరిగిన గొడవల వలన మీ బామ్మగారికి, మీ నాన్నగారికి మేమంటే గిట్టక మీ అమ్మని, మిమ్మల్ని పంపకపోయినా మమ్ముల్ని చూడడానికి వచ్చావా నాయనా, మీ అమ్మని చూసినట్లే వుందిరా” అని కన్నీళ్ళు పెట్టుకున్న అమ్మమ్మ ఇల్లు కదలనివ్వలేదు వేణుగోపాలాచార్యులని.
కచేరి సావిట్లో ఏర్పర్చిన కుర్చీల్లో పెద్దలంతా కూర్చుని ఉన్నారు. వేణుగోపాలాచార్యులు అందరికీ నమస్కారం చేశారు. పెద్ద మేనమామ అక్కడున్న ఒక్కొక్కర్ని పరిచయం చేశారు. కుశల ప్రశ్నలైన తరవాత, రాణీవారు…