Member-only story

భయం! — English

Srinivasa K. Rao, Ph.D.
8 min readOct 27, 2023

--

వేమూరి వేంకటేశ్వరరావు

నిశీధి! నిర్మానుష్యం! నిశ్శబ్దం?

అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఆ దుంగ ఇంటి బయట గోడని ఏదో గీకుతూన్నట్లు చప్పుడయింది. ఆ చప్పుడుకి ఒళ్ళంతా ఒక్కసారి జలదరించింది. హృదయ స్పందన లయ తప్పినట్లయింది. చలితో బయట నుండి, భయంతో లోపల నుండి ఒణుకు పుట్టుకొచ్చింది.

అప్పుడు నేను అలాస్కాలో, ఫెయిర్‌బేంక్స్‌కి ఉత్తరంగా — ఉత్తర ధృవ చక్రానికి ఒక్క రవ దక్షిణంగా — చుట్టుతా కనుచూపు మేర మంచుతో కప్పబడ్డ ప్రదేశంలో, ఒక దుంగ ఇంట్లో, ఒంటరిగా ఉంటున్నాను. ఆ కాలంలో రాత్రి శీతోగ్రత నీటి ఘనీభవ స్థానానికి 35 డిగ్రీలు దిగువ వరకు దిగేది. ఆ చలికి భూమ్యాకర్షణ కూడ గడ్డకట్టుకు పోయిందా అన్నట్లు మంచు కూడ కురవటం మానేసింది. అంత చలిలో కంఠంలో ప్రాణం ఉన్న ఏ జీవి కూడ సాహసించి బయటకి రాలేదు. కాని, బయట ఏదో ఉంది. లోపలకి రాడానికి ప్రయత్నిస్తూన్నట్లు ఉంది. కుటీరపు గోడలని గోకుతోంది!

చలిని మించి నిశ్శబ్దమో, నిశ్శబ్దాన్ని మించి చలో అర్ధం కాని ఆ వాతావరణంలో నిశ్శబ్దాన్ని చీల్చుతూ అప్పుడప్పుడు పొయ్యిలో కాలుతూన్న కట్టెలు చిటపటలు, ఫెళఫెళలు చేస్తూ చలిని చెండాడుతున్నాయ్. ఆ చీకటిలో, పైకి ఎగసే ఆ మంట వెలుగులో గోడ మీద పడ్డ నా నీడ నాట్యం చేస్తోంది. పోతే, నేను ధరించిన శీతాకాలపు దుస్తులు చేసే బరబర శబ్దం తప్ప బయట నుండి మరొక శబ్దం లేదు. ఇహ మిగిలింది ఆ నిశ్శబ్దాన్ని భరించలేక నా మనస్సులో ఉన్న ఊహలకి మాటలు జోడించి నాలో నేను మాట్లాడుకునే మాటలు తప్పితే మరే శబ్దానికి ఆస్కారం లేదు ఆ ఇంట్లో. అట్టి పరిస్థితిలో కుటీరపు గోడని గోకుతోన్నట్లు శబ్దం వినిపించింది.

ఎక్కడా అనుమానానికి అవకాశం లేదు. బయట గోడని ఏదో గోకుతోంది. ఎవ్వరో కాదు. ఎవ్వరో అయితే తలుపు తడతారు. పాదాల చప్పుడు ఉంటుంది. ఈ చప్పుడు తీరే వేరు. ఇది కొమ్మ రాపిడి కూడ కాదు; అలాస్కాలో అంత…

--

--

Srinivasa K. Rao, Ph.D.
Srinivasa K. Rao, Ph.D.

Written by Srinivasa K. Rao, Ph.D.

Biomedical Scientist in New York is interested in Nutrition, Metabolomics, Food as Medicine, STEM and AI. https://www.linkedin.com/in/sraonewyrok/

Responses (1)