Member-only story
భయం!
వేమూరి వేంకటేశ్వరరావు
నిశీధి! నిర్మానుష్యం! నిశ్శబ్దం?
అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఆ దుంగ ఇంటి బయట గోడని ఏదో గీకుతూన్నట్లు చప్పుడయింది. ఆ చప్పుడుకి ఒళ్ళంతా ఒక్కసారి జలదరించింది. హృదయ స్పందన లయ తప్పినట్లయింది. చలితో బయట నుండి, భయంతో లోపల నుండి ఒణుకు పుట్టుకొచ్చింది.
అప్పుడు నేను అలాస్కాలో, ఫెయిర్‌బేంక్స్‌కి ఉత్తరంగా — ఉత్తర ధృవ చక్రానికి ఒక్క రవ దక్షిణంగా — చుట్టుతా కనుచూపు మేర మంచుతో కప్పబడ్డ ప్రదేశంలో, ఒక దుంగ ఇంట్లో, ఒంటరిగా ఉంటున్నాను. ఆ కాలంలో రాత్రి శీతోగ్రత నీటి ఘనీభవ స్థానానికి 35 డిగ్రీలు దిగువ వరకు దిగేది. ఆ చలికి భూమ్యాకర్షణ కూడ గడ్డకట్టుకు పోయిందా అన్నట్లు మంచు కూడ కురవటం మానేసింది. అంత చలిలో కంఠంలో ప్రాణం ఉన్న ఏ జీవి కూడ సాహసించి బయటకి రాలేదు. కాని, బయట ఏదో ఉంది. లోపలకి రాడానికి ప్రయత్నిస్తూన్నట్లు ఉంది. కుటీరపు గోడలని గోకుతోంది!
చలిని మించి నిశ్శబ్దమో, నిశ్శబ్దాన్ని మించి చలో అర్ధం కాని ఆ వాతావరణంలో నిశ్శబ్దాన్ని చీల్చుతూ అప్పుడప్పుడు పొయ్యిలో కాలుతూన్న కట్టెలు చిటపటలు, ఫెళఫెళలు చేస్తూ చలిని చెండాడుతున్నాయ్. ఆ చీకటిలో, పైకి ఎగసే ఆ మంట వెలుగులో గోడ మీద పడ్డ నా నీడ నాట్యం చేస్తోంది. పోతే, నేను ధరించిన శీతాకాలపు దుస్తులు చేసే బరబర శబ్దం తప్ప బయట నుండి మరొక శబ్దం లేదు. ఇహ మిగిలింది ఆ నిశ్శబ్దాన్ని భరించలేక నా మనస్సులో ఉన్న ఊహలకి మాటలు జోడించి నాలో నేను మాట్లాడుకునే మాటలు తప్పితే మరే శబ్దానికి ఆస్కారం లేదు ఆ ఇంట్లో. అట్టి పరిస్థితిలో కుటీరపు గోడని గోకుతోన్నట్లు శబ్దం వినిపించింది.
ఎక్కడా అనుమానానికి అవకాశం లేదు. బయట గోడని ఏదో గోకుతోంది. ఎవ్వరో కాదు. ఎవ్వరో అయితే తలుపు తడతారు. పాదాల చప్పుడు ఉంటుంది. ఈ చప్పుడు తీరే వేరు. ఇది కొమ్మ రాపిడి కూడ కాదు; అలాస్కాలో అంత ఉత్తరాన్న చెట్లేవీ? ఈ…