Member-only story
రుచి
“అడ్డమైన రాజకీయ నాయకుల దొడ్డిదారి రిజర్వేషన్లు నాకు వద్దు. ఈ రైలు కాకపోతే మరొకటి. విమానం, కారు బస్సు, ఆఖరికి లారీ అయినా ఫరవాలేదు. కానీ ఈ దొంగ ఎమర్జెన్సీ కోటా సీటు నాకు వద్దు” మిట్ట మధ్యాహ్నం ఎండలో నిప్పుకణికల్లాంటి ఈ మాటలు విశాఖపట్నం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ముందు ఉన్నవాళ్ళని కదలనివ్వకుండా నిలబెట్టాయి.
“అది కాదమ్మా…” బహుశా డ్రైవర్ వినయంగా అంటున్నాడు కారు డోర్ దగ్గర నిలబడి.
“మరేం చెప్పకు. ఆ రికమండేషన్ కాగితం చింపెయ్యి”
ఆ మాటలు అంటున్న ఆమెపైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఆమెది ఆమె గొంతు కంటే దృఢమైన దేహం. పొడగరి. ధనిక స్త్రీ అని చూసిన వెంటనే అనిపించే ఠీవి. నల్లకళ్ళద్దాలు ఆమె ఒంటి తెల్లదనాన్ని మరింత పెంచుతున్నాయి. చీరకట్టు ఆమె ప్రౌఢత్వాన్ని ప్రతి కోణం నుండి ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తున్నది. సాధారణమైన పొందూరు నేతచీర ఆమె వంటి పై కొత్త అందాన్ని పొంది విరగబూసిన కనకాంబరం పొదలా పొందికగా ఉంది. ఆమె చీరకే కాదు, చేరువగా వున్న దేనికైనా తన అందాన్ని ఆపాదించగల శక్తి కలదని అనిపించేట్టుగా వుంది.
“మేడం…” దీనంగా ఓ యువకుని గొంతు. అందరూ ఆ యువకునివైపు చూసారు. నిటారుగా నిలబడితే ఐదు అడుగుల ఆరంగుళాలు ఉంటాడేమో. కొత్త తెలుగు సినిమా హీరోల కంటే అందగాడుగా అనిపిస్తాడు. సరైన పోషణ లేక నీరసించి వాడిన అరటి చెట్టులా కనిపించాడు. సమాజంలో కనిపించని అవకతవకలకి ప్రతినిధిలా ఉన్నాడు.
“మేడం… మీకు అటువంటివి ఇష్టం లేకపోతే, ఆ కాగితం చించెయ్యకండి. నాకు ఇవ్వండి. ఓ కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళవుతారు. నాకు రేపు హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉంది. అప్పు దొరకక ఇప్పటిదాకా టికెట్టు కొనుక్కోలేకపోయాను. అప్పు దొరికింది కాని రిజర్వేషన్ లేదు. ప్లీజ్…” యువకుడు ప్రాధేయపడ్డాడు.
“ఛీ!… ఛీ!!.. మీలాంటి యువకులే అడ్డదారిన పైకి వెళ్ళిపోదామనుకుంటే ఈ దేశం…