Member-only story
సంకల్పం
‘ఇప్పుడు కాకపోతే, మరెప్పుడు? మనం కాకపోతే మరెవ్వరు?’
అమెరికా దేశంలో, మిషిగన్ రాష్ట్రంలో, గేంజస్ అన్న ఊరులో ఉన్న వివేకానంద మొనాస్టరీ ఆవరణలో ఆగస్టు నెల ఆఖరు వారం కలిసిన వంద మంది భారతీయులను రెండు రోజులుగా ఆలోచింపజేస్తున్న ప్రశ్నలవి. -
బ్రిటిష్ పాలన నుండి రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించుకొని 50 ఏళ్ళు పైబడ్డా, ఎన్నో రకాలుగా వెనకబడి, సుమారు సగానికి సగం జనం నిరక్షరాస్యతతో, కులాల కుమ్ములాటలతో; అధికార దాహంతో, ప్రజాసేవ పేరుతో పదవులెక్కుతున్న రాజకీయ నాయకులతో; దిక్కుతోచని నిస్పృహతో మాతృదేశం కుళ్ళిపోతుంటే సమాజానికి ఉత్తేజం కలిగించే ఉద్యమం కావాలి. అది ఇప్పుడు కాకపోతే మరెప్పుడు?
ఆ దేశంలో పుట్టి, ఆ దేశంలో పెరిగి, ఆ దేశంలోని ఉన్నత విద్యా సౌకర్యాలని పూర్తిగా ఉపయోగించుకొని, పట్టాలు పుచ్చుకుని, విదేశం వచ్చి వివిధ రంగాలలో నిలదొక్కుకొని, కొదో గొప్పో పేరు సంపాదించుకొని, ఆ దేశానికి కావలసినది చెయ్యగల స్థితిలో ఉన్న మనం కాకపోతే మరెవ్వరు?
‘ఎన్నో వనరులతో, శతాబ్దాలుగా స్వశక్తిపై ఆధారపడి, స్వంత బుద్ధితో, విద్య, వ్యవసాయ వ్యాపార రంగాలలో ముఖ్యమైన దేశంగా నిలబడ్డ భారతదేశం ఈనాడు ఇంత వెనకబడ్డ దేశంగా ఉండనవసరం లేదు. బాధ్యతాయుతమైన భారతీయులుగా దేశం బాగుకై మీ మీ పరిధులలో, మీ మీ శక్తి కొద్దీ, మీరు చెయ్యగలిగినది చెయ్యండి’ అన్న డాక్టర్ భాగవతుల పరమేశ్వర రావు గారి పిలుపునందుకొని సమావేశమైన వాళ్ళ సామూహిక ఆలోచనల సారమిది.
‘ఆషా’, ‘ఎఐడి’, ‘ఐఎల్ పి’ వంటి సంస్థల సభ్యులు, అమెరికా దేశంలో వివిధ రాష్ట్రాలలో డాక్టర్ పరమేశ్వరరావు గారి సభలకి వచ్చిన ప్రతిభావంతులతో ఆ ప్రదేశం నిండిపోయింది. దేశం బాగుకోసం అంతమంది కలవడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఎవరి మొహంలో చూసినా ఉత్సాహం పెల్లుబుకుతున్నది. అందరికీ అందరూ సుమారుగా కొత్తవారే. ఒకరిని ఒకరు పలకరించుకొంటూ, పరిచయాలు…