Member-only story
సగం కుండ
“వేగావతి స్త్రీ స్వాతంత్ర్యం కోసం పాటుపడుతున్న సంఘసేవకురాలు. సమాజసేవే ఆమె జీవితంలో వున్న ముఖ్యమైన అంశం. కాలేజీ రోజులనుండి సమాజసేవలో ఉంటూ లేజీ అన్న పదానికి దూరంగా ఉంది. ఆమె వ్యాసాలు వ్రాసింది. కథలు వ్రాసింది. కవితలు వ్రాసింది. రేడియోలో, టీవీలో ఉపన్యాసాలు ఇచ్చింది. దాదాపు రోజూ ఏదో ఒక వేదిక మీద ఉపన్యాసం ఇస్తూ వుంటుంది. పత్రికలలో, పేపర్లలో ఆమె రచనలు, ఫోటోలు తరచూ వస్తూనే వుంటాయి. స్త్రీవాదం ఆమె ఊపిరి. ‘నరనరాన, అణువణువున, నా రక్తంలో కణకణాన స్త్రీవాదం నిండివున్న నిండుకుండ లాంటి స్త్రీవాదిని’ అని ఆమే ఒకసారి టీవీ కార్యక్రమాలలో ప్రకటించుకుంది. తన గురించి తానే చెప్పుకుంది, ఆమె స్త్రీ స్వాతంత్రం కొరకు అడుగడుగునా శ్రమిస్తుంది. ఒక వారపత్రికలో ఆవిడ స్త్రీల కోసం ఒక శీర్షిక నడుపుతుంది. స్త్రీలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆమెకు వ్రాస్తే జవాబు ఇస్తుంది. ఆ శీర్షిక పేరు ‘నేను- నా ఇష్టం.’
ఉదయం వరండాలో కూర్చొని నిన్న వచ్చిన ఉత్తరాలను ఒక వరుసలో చదువుతోంది. అప్పుడే పెళ్ళైన ఓ ఇరవైమూడేళ్ళ యువతి రాసిన సుదీర్ఘ ఉత్తరం. సంక్షిప్తంగా దాంట్లో ఉన్నదేమిటంటే ….
‘వేగావతిగారూ, నేను మీ వీరాభిమానిని స్కూలు రోజులనుండి మీరు వ్రాస్తున్న ప్రతిదీ చదువుతున్నాను. నా శరీరం, నా బట్టలు, నా హక్కు నా ఇష్టం అని మా నాన్నతో వాదించి, మా పాతకాలపు అమ్మను సాధించి, నాకు నచ్చిన అన్ని రకాల బట్టలు వేసుకొని తిరిగాను. డబ్బుకోసం చదివే చదువులు చదవనని తెగేసి చెప్పాను. బి.ఏ. చేసి జెండర్ ఈక్వాలిటీ (లింగ సమానత్వం)లో యూరప్ లో డిప్లొమా చెయ్యాలనుకున్నాను. ఖర్చు ఎంతైనా సరే నాకు ఆస్తిలో రావాల్సిన వాటాలో జమచేసుకోమని మా నాన్నకి చెప్పాను. ‘ఇంటిలోని బంగారంలో, భూమిలో, సగం నాది, సగం మా అన్నది అన్నానని’ అని ఆశ్చర్యపోయే అమ్మానాన్నలకి మీరు వ్రాసిన వ్యాసాలు చూపించి ఒప్పించాను. యూరప్ వెళ్ళాను. నాకిష్టమైన కోర్సు చేశాను’.