Member-only story
హాచ్…!
(ఒక దొంగదేవుడు, దొంగదొర, దొంగరాణిల కథ)
దేవుడికి కష్టం వచ్చింది.
దేవుడి పూర్తి పేరు భుజంగ దేవర.
ఆయన తన నియోజకవర్గంలోని ప్రజలకు దేవుడే. దేవుడంటే ఎప్పుడూ వరాలు ఇచ్చేవాడే కాదు. ‘దుష్ట శిక్షణ’ చేసేవాడు కూడా. పాపులు ఎక్కువైపోయిన ఈ రోజుల్లో భుజంగ దేవర అలియాస్ దేవుడు శిక్షించడానికే అవతారమెత్తిన వాడు. అయితే ఆయన ఎక్కువకాలం హైదరాబాదు, ఢిల్లీల్లో ఉండి ‘ప్రజాసేవ’ చేస్తుంటారు. కాబట్టి ఆయన నమ్మినబంట్లు ప్రజలను శక్తివంచన లేకుండా శిక్షిస్తూంటారు. ఇప్పటిదాకా దేవుడు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆయన చాలా ఏళ్ళుగా ఆ నియోజవకర్గం ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయన ఎన్నికల్లో ప్రజాసేవ కోసం’, ‘ప్రజల కోరికపై’, ‘ప్రజల బాగుకై’ నిలబడుతూ ఉంటారు. అందుకే ఆయన ఎప్పుడూ ఓడిపోరు.
ఎంత కలికాలం అయినా భరతఖండంలో రానురాను ‘ప్రజా సేవ’ చెయ్యాలన్న ప్రగాఢమైన కోరిక చాలా చాలా మందికి పుట్టుకొస్తోంది. బస్తాలకొద్దీ డబ్బు ఖర్చుపెట్టి అయినా సరే, ఎన్నికల్లో నిలబడి, గెలిచి ‘ప్రజాసేవ’ చెయ్యాలన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. దేవుడులాంటి నాయకులను ఓడించడం మాట అలా ఉంచి అసలు ఎదిరించి నిలబడడమే కష్టం. ఒకవేళ పోటీకి నిలబడ్డా ఓడిపోవడం ఖాయం. అందుకే అలాగే జరిగింది. దేవుడుగారు గెలిచారు.
ఓడిపోయిన అభ్యర్థి అక్కడితో ఊరుకోక దేవుడి గారి మూలాలు వెతికాడు. ఆ నియోజకవర్గం ఎస్టీలకు కేటాయించబడింది. దేవుడు ఎస్టీట. ఓడిపోయిన అభ్యర్థి తీగలాగడం వల్ల దేవుడు గారు ఎస్టీ కాదని తేలింది. దేవుడు గారి ఎన్నిక చెల్లదని కోర్టు ఓ నాలుగేళ్ళ తరువాత తీర్పు ఇచ్చింది. అందుకే దేవుడు మాజీ ఎమ్మెల్యే అయ్యాడు. దొంగ ఎస్టీ సర్టిఫికెట్ పెట్టినందుకు ఆయన్ని ఎవరూ శిక్షించలేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఎవరినైనా ‘శిక్షించేది’ ఆయనే కాబట్టి. ఇప్పుడు ఆయన ఎస్టీ కాదని తేలింది కాబట్టి రాబోయే ఎన్నికల్లో నిలబడడానికి వీలుకాదు. అది…